Tuesday, December 24, 2024

ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు చేరుకొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలు దేరారు. జాతీయ జెండాను ప్రధాని  ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ ఎర్రకోట నుంచి జెండా ఎగురవేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పది సార్లు జాతీయ జెండా ఎగుర వేయగా మోడీ 11 సార్లు జెండా ఎగుర వేసి రికార్డు సృష్టించారు.  ఎర్రకోటకు ప్రముఖులు తరలివస్తున్నారు.

భారత దేశ ప్రజలకు అమెరికా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇలాగానే కొనసాగాలని విదేశాంగ శా మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. భారత ప్రజలు సంపన్న, వైవిధ్యమైన చరిత్రను గుర్తు చేసుకోవడంతో పాటు ఆగస్టు 15న తాము కూడా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News