- Advertisement -
న్యూయార్క్ : ఐరాస సర్వసభ్య సమితి 78వ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. భారత్‌తో దౌత్య సంబంధాలు బెడిసికొట్టడానికి దారితీసిన కారణలపై అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆయనను నిలదీయగా ఆయన నో కామెంట్స్ అంటూ దాటవేశారు. ఖలీస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారతీయ ఏజెంట్లు కారణం అని ట్రూడో దేశ పార్లమెంట్‌లో ఆరోపించారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని భారతదేశం తెలిపింది. దీనిపై స్పందనను కోరగా ట్రూడో మౌనం వహించారు. ఐరాస సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని పలు విషయాలపై మాట్లాడారు. క్లెమెట్ లక్షాల సదస్సు, ఉక్రెయిన్‌పై భద్రతా మండలి చర్చ, గ్లోబల్ కార్బన్ ఉద్గారాల విషయాలపై స్పందించారు.
- Advertisement -