- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపు లోనే ఉంది. కొత్త కేసులు పదివేల లోపే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దాదాపు 8 వేల కేసులు నమోదవ్వగా, క్రియాశీల కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2.66 లక్షల పరీక్షలు చేయగా, 7946 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.98శాతంగా ఉంది. క్రితం రోజు 7231 కేసులతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో 9828 మంది వైరస్ నుంచి కోరుకున్నారు. ఇప్పటివరకు 4.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, రివకరీ రేటు 98.67 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.14 శాతానికి తగ్గింది. ఇక బుధవారం మరో 12.90 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు 212.52 కోట్ల డోసులు పంపిణీ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- Advertisement -