Friday, November 22, 2024

దేశంలో కరోనా కొత్త కేసులు 795

- Advertisement -
- Advertisement -

795 foreign Covid variant cases reported in India

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 795 కు చేరుకుంది. ఇవి బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలకు చెందిన కేసులని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. మార్చి 18 న 400 కేసులు కాగా ఇప్పటికి అయిదు రోజుల్లోనే సంఖ్య రెట్టింపు అయింది. ఇదివరకు సార్స్ కొవి 2 సోకిన వారికైనా ఈ కొత్త రకాలు వ్యాపించే పరిస్థితి ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించినట్టు కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్విని చౌబే రాజ్యసభకు మార్చి 18న లిఖితపూర్వకంగా తెలియచేశారు. బ్రిటన్ రకం వైరస్ కేసు దేశంలో మొదట డిసెంబర్ 29న నమోదైంది. పంజాబ్‌లో 401 నమూనాలను పరిశీలించగా, వాటిలో 81 శాతం బ్రిటన్ రకానికి చెందినవని వెల్లడైంది. దీంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమై యువతకు కూడా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

795 foreign Covid variant cases reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News