మైనర్ బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిపిన నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిక్కిం లోని గ్యాల్‌షింగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికను పనుల్లో సహాయం పేరుతో స్థానిక మహిళ నిత్యం తన ఇంటికి తీసుకెళ్లేది. ఆ బాలికను బలవంతంగా వ్యభిచారం లోకి దింపింది. మహిళ భర్త, మరో ఇద్దరు వ్యక్తులతోపాటు నలుగురు బాలురు ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఎప్పుడూ అనారోగ్యంతో ఉండటం, అలాగే ఎవరితో మాట్లాడకుండా క్లాస్‌లో మౌనంగా ఉంటుండడం స్కూల్ టీచర్ గమనించి ఆరా తీసింది. దీంతో ఆమెపై జరిగిన లైంగిక దాడుల నిర్వాకం బయటపడింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆ స్కూల్ సమాచారం ఇవ్వడంతో ఏప్రిల్ 11న పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలిని వ్యభిచారం లోకి దింపిన మహిళను, ఆమె భర్తను, మరో ఇద్దరు వ్యక్తులను, నలుగురు మైనర్ బాలురను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. పోక్సో చట్టంతోపాలు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏడాదికి పైగా బాలికపై అత్యాచారం.. నలుగురు బాలురతో సహా 8 మంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -