Monday, January 20, 2025

మణిపూర్ దుర్ఘటనలో 8 మంది అస్సామీల మృతి

- Advertisement -
- Advertisement -

8 Assamese killed in Manipur landslide accident

గువాహటి: మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఒక రైల్వే నిర్మాణ స్థలంలోని క్యాంపుపై కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఒక సైనిక జవానుతోసహా అస్సాంకు చెందిన 8 మంది మరణించినట్లు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పిజుష్ హజారికా శనివారం తెలిపారు. ఒక రైల్వే ఇంజనీర్‌తోసహా రాష్ట్రానికి చెందిన మరో 12 మంది ఆచూకీ తెలియరావడం లేదని ఆయన చెప్పారు. తుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ క్యాంపుపై బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 25కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 38 మంది ఆచూకీ తెలియరాలేదు. శిథలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోందని శనివారం ఉదయం తుపుల్ చేరుకున్న హజారికా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News