Wednesday, January 1, 2025

ఉప్పల్ లో పేలిన బ్యాటరీ బైక్…. ఎనిమిది వాహనాలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్, వివేక్ నగర్ లోని ఓ ఇంటి ఆవరణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో దగ్ధమైన రెండు బ్యాటరీ బైక్, ఏడు ఇతర బైకులను గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 సమయంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పాటు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News