సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ జిల్లా అన్ని ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల తర్వాత బీటలు వారిన, బాగా ధ్వంసమైన 8 భవనాలు గురువారం కూలిపోయాయి. ఈ ఇళ్లలోని వారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. దుకాణాలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఉన్న ఈ భవనాలు నాలుగైదు రోజుల క్రితం బీటలు వారాయని, వీటిని ముప్పు ఏర్పడిన భవనాలుగా ఇప్పటికే ప్రకటించామని అన్ని ఎస్‌డిఎం నరేష్ వర్మ తెలిపారు. ఆస్తి నష్టాన్ని మదింపు చేస్తున్నామని, ముందు జాగ్రత్త చర్యలగా అన్నిలోని 305 జాతీయ రహదారిపై ఉన్న ఇతర ప్రమాదకర భవనాల నివాసితులను ఖాళీ చేయించామని ఆయన చెప్పారు.
కాగా.హిమాచల్ ప్రదేశ్‌లోని అఏక ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగుతున్నయా.ఇ బుధవారం సాయంత్రం నుంచి 37 మిల్లీమీటర్ల వర్షపాతం పలంపూర్‌లో నమోదైంది. నహన్‌లో 93 మిల్లీమీటర్లు, సిమ్లాలో 79 మిల్లీ మీటర్లు, ధరంశాలలో 70 మిల్లీమీటర్లు, మండిలో 57 మిట్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హిమాచల్‌లో భారీ వర్షం కారణంగా సంభంచిన విపత్తులలో మొత్తం 120 మంది ఈ నెలలోనే మరణించారు. జూన్ 24న వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 238 మంది మరణించారు. 40 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
Several buildings collapsed in Anni of Kullu district in Himachal Pradesh pic.twitter.com/qJZurRnSY9
— Weatherman Shubham (@shubhamtorres09) August 24, 2023