Friday, September 20, 2024

జూన్ 24 నుంచి 8 రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

- Advertisement -
- Advertisement -

జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక
24, 25 తేదీలలో కొత్త ఎంపీల ప్రమాణం
జులై 3 వరకు కొనసాగనున్న సమావేశాలు

న్యూఢిల్లీ: ఈనెల 24న 8 రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3వ తేదీ వరకు జరిగే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశముందని వర్గాలు తెలిపాయి. జూన్ 24, 25 తేదీలలో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకరాం చేస్తారని వారు చెప్పారు. లోక్‌సభకు కొత్త స్పీకర్ ఎంపికే ఈ ప్రత్యేక సమావేశాలలో ఎన్‌డిఎ ప్రధాన అజెండాలలో ఒకటి కానున్నది. ఎన్‌డిఎ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్(యు) రెండూ స్పీకర్ పదవిపై కన్నేయడంతో లోక్‌షభ స్పీకర్ పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి 240 స్థానాలు దక్కడం, మెజారిటీకి 32 స్థానాలు తగ్గడంతో బిజెపిలో తిరుగుబాటు ఏర్పడుతుందన్న భయాలు ఆ పార్టీలోనే తలెత్తాయి. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడంలో ఇటీవలి కాలంలో చురుకైన పాత్ర పోషిస్తున్న బిజెపికి ఇది ఊహించని పరిణామంగా మారింది. అయితే ఇటువంటి పరిస్థితిలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తెలరమీదకు వస్తుంది. ఈ చట్టాన్ని అమలుచేయగల ఏకైక వ్యక్తి స్పీకర్ కావడంతో ఈ పదవి అత్యంత కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితిలోను ఈ పదవిని వదులుకోవడానికి ఇష్టపడని బిజెపి మరి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న టిడిపి, జెడియుల డిమాండ్‌ను ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News