- Advertisement -
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా మహేష్ పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతం సంభవించడంతో 8 మంది చనిపోయారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జరిగింది. కండక్టర్, డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ఆరుగురు చికిత్స పొందుతూ చనిపోయారు. 17 మంది జోధ్ పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అడిషనల్ కలెక్టర్ చాగన్ లాల్ గోయల్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -