Wednesday, January 22, 2025

ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 8 మంది దుర్మరణం!

- Advertisement -
- Advertisement -

8 Dead in Stampede After Football Match At Africa Stadium

8 మంది దుర్మరణం!

కామెరూన్: ఫుట్‌బాల్ స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన కామెరూన్‌లో చోటు చేసుకుంది. రాజధాని యౌండేలో జరిగిన ఆఫ్రికా కప్ నేషన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్‌బియో స్టేడియానికి తరలివచ్చారు. స్టేడియం పూర్తి సామర్థం 60 వేలు కాగా, కరోనా నేపథ్యంలో 60 శాతం మందికే నిర్వాహకులు అనుమతిచ్చారు. ఇక భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో నిర్వాహకులు 80 శాతం మందికి స్టేడియంలో ప్రవేశించేందుకు అవకాశం కల్పించారు. అయితే ప్రేక్షకులు ఒక్కసారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు దూసుకు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కనీసం 8 మంది మృతి చెంది ఉంటారని కామెరూన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక సంఘటనపై కామెరూన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News