Thursday, January 23, 2025

స్నానం చేయడానికి వెళ్లి 8 మంది నదిలో గల్లంతు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలోగల మేష్వో నదిలో శుక్రవారం సాయంత్రం స్నానం చేస్తూ 8 మంది గల్లంతయ్యారు. మృతులను దెహగామ్ తాలూకాలోని సోగ్తి గ్రామవాసులుగా గుర్తించినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ బి మోడియ తెలిపారు. గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. నదిలో నుంచి ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన చెప్పారు. ఎంతమంది నదిలో గల్లంతయ్యారో స్పష్టత లేదని ఆయన చెప్పారు. స్థానికులైన వీరంతా ఆ ప్రదేశంలో నది ఎంత లోతున ఉందో వారు గ్రహించలేకపోయారని ఆయన అన్నారు. కొద్ది దూరంలో నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాం వల్ల నీటి మట్టం ఇటీవల పెరిగినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News