Friday, December 20, 2024

సికింద్రాబాద్ – తిరుపతి ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’కు 8 అదనపు బోగీలు!

- Advertisement -
- Advertisement -

రైలు నం. 20701 ఎస్‌సిటిపిటివై సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరి తిరుపతి చేరుకుంటుంది.

హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ పెరుగడంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా ఎనిమిది బోగీలను మే 17 నుంచి జోడించనున్నారు. ఈ రైలులో 100 శాతం ఆక్యుపెన్సీ ఉండడంతో డిమాండ్‌కు తగినట్లు బోగీలు జోడించనున్నారు.

తిరుపతికి వెళ్లే యాత్రికులు, ప్రయాణికులు రిజర్వేషన్ల విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు అందడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వేతో చర్చించి ఎక్స్‌ప్రెస్ రైలుకు మరో ఎనిమిది బోగీలు జోడించాలని అధికారులను ఆదేశించారు.

సికింద్రాబాద్- తిరుపతి ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌’కు ఎనిమిది బోగీలు, ఏడు ఏసి బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ బోగీ ఉంది. బోగీల పెంపు గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై సికింద్రాబాద్ నుంచి ఉదయం 6.15 గంటలకు బయలుదేరి తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మే 17న మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News