Friday, November 15, 2024

మంకీపాక్స్ వ్యాక్సిన్ రేస్‌లో 8 సంస్థలు

- Advertisement -
- Advertisement -

8 Firms in Monkeypox Vaccine Race

న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ నివారణ వ్యాక్సిన్ తయారీకి 8 ఔషధ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో ఇండియాలో కూడా అక్కడక్కడ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇంతవరకూ ఈ వైరస్‌కు ఎటువంటి నివారణ మందు రూపొంది లేదు. సంబంధిత వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్)కు ఇప్పటికే 31 బిడ్లు అందాయి. వ్యాక్సిన్ , మంకీపాక్స్ నిర్థారణ కిట్స్ తయారీకి సిద్ధంగా ఉన్నామని ఆయా సంస్థలు తెలియచేసుకున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో వ్యాక్సిన్ రూపొందుతుంది. అయితే పలు సంస్థలు తయారీకి ఆసక్తి చూపినా ఇప్పుడు ఈ పోటీలో 8 సంస్థలు నిలిచాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మంకీపాక్స్ వైరస్‌కు సంబంధించి అందిన మొత్తం 31 బిడ్లలో ఎనిమిది వ్యాక్సిన్ తయారీ, మిగిలిన 23 డిటెక్షన్ కిట్స్ రూపకల్పనకు సంబంధించి అందినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News