Monday, January 20, 2025

ఆపరేషన్ లోటస్ : బీజేపీలో చేరిన 8 మంది గోవా కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు

- Advertisement -
- Advertisement -

8 Goa Congress MLAs joined BJP

ప్రస్తుతం 3 కు పడిపోయిన కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల బలం

పనాజీ : గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్షనేత మైఖేల్‌లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు పాలక బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్రమోడీ , గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బేజేపీలో చేరామని మైఖేల్ లోబో వెల్లడించారు. 8 మంది ఎమ్‌ఎల్‌ఎలు బీజేపీ పంచన చేరడంతో గోవాలో కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎల బలం 3 కు పడిపోయింది. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి మైఖేల్ లోబో సహా పార్టీ మారిన ఎమ్‌ఎల్‌ఎలు లేఖ అందజేశారు. కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దిలియ లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సి సెక్విర, దుదోల్ఫ్ ఫెర్నాండెజ్‌లు బీజేపీలో చేరారు. అంతకు ముందు బీజేపీలో విలీనమైనట్టు గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తీర్మానాన్ని ఆమోదించింది. బీజేపీలో చేరికకు ముందు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు సీఎం ప్రమోద్ సావంత్‌తో భేటీ అయ్యారు. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో విఫలమైన ఆపరేషన్ లోటస్ గోవాలో విజయవంతమైందని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. 40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్‌ఎల్‌ఎలు ఉండగా బీజేపీకి 20 మంది ఎమ్‌ఎల్‌ఎలు ఉన్నారు. 2019 లోనూ ఇదే తరహాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు బీజేపీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News