మార్చిలో ప్రసిద్ధ బాల్టిమోర్ వంతెన కూలిపోవడానికి కారణమైన కార్గో నౌక ‘దలి’లోని భారతీయ సిబ్బందిలో ఎనిమిది మంది సుమారు మూడు నెలల పాటు ఆ భారీ నౌకలోనే గడిపిన అనంతరం శుక్రవారం స్వదేశానికి పయనమయ్యారు. బాల్టిమోర్ మారిటైమ్ ఎక్స్‌చేంజ్ సమాచారం ప్రకారం, 21 మంది సిబ్బందిలో నలుగురు ఇంకా 984 అడుగుల నిడివి ఉన్న ఎంవి దలీలోనే ఉన్నారు, తక్కిన సిబ్బందిని బాల్టిమోర్‌లో ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు తరలించారు, వారు దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. నౌక సిబ్బందిలో 20 మంది భారత జాతీయులు కావడం గమనార్హం.
బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి స్తంభాలను ఢీకొని వంతెన కూలడానికి, ఆరుగురు నిర్మాణ కార్మికుల మరణానికి కారణమైన ఎంవి దలీలో ఉన్నారు, దలీ నౌకకు నార్‌ఫోక్‌లో మరమ్మతులు చేస్తారు, న్యాయమూర్తి ఆమోదించిన ఒక ఒప్పందం దృష్టా ఒక వంటమనిషి, ఒక ఫిట్టర్, సీమెన్‌తో సహా ఎనిమిది మంది భారతీయ సిబ్బందిస్వదేశానికి బయలుదేరారు, వారిలో ఎవ్వరూ అధికారులు కాదు. తక్కిన 13 మంది దర్యాప్తు పెండింగ్ కారణంగా యుఎస్‌లోనే ఉంటారు. కాగా, సిబ్బందిలో ఎవ్వరిపైనా ఆ ప్రమాదం సందర్భంగా అభియోగాలు నమోదు కాలేదు. ఎఫ్‌బిఐ, ఇతర ఫెడరల్ సంస్థలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.