Sunday, December 22, 2024

వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు… 8 కిలోల చాక్లెట్లను స్వాధీనం చేేసుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: చాక్లెట్లు తిని విద్యార్థులు వింత ప్రవర్తించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాక్లెట్లపై మత్తు చల్లి అమ్ముతున్న పాన్‌షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల పక్కన ఓ వ్యక్తి పాన్‌షాపు నడుపుతున్నాడు. పాన్‌యజమాని విద్యార్థులకు మత్త చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. చాక్లెట్లు తినగానే పాఠశాల విద్యార్థులు మత్తులోకి జారుకుంటున్నారు. కొన్నాళ్లుగా పాఠశాల విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వచ్చి పోలీసులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఒటి పోలీసులు పాన్ షాప్‌పై దాడి చేసి ఎనిమిది కిలోల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లలో గంజాయి కలిపినట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News