Friday, December 20, 2024

జెక్ నగరం బ్రనోలో అగ్ని ప్రమాదం… 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

ప్రాగ్: జెక్ రిపబ్లిక్ లోని రెండో పెద్ద నగరం బ్రనోలో అర్ధరాత్రి దాటాక సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాగ్‌కు ఆగ్నేయంగా 200 కిమీ దూరాన ఈ ప్రమాదం సంభవించిందని, రెండు గంటల పాటు మంటలు చెలరేగాయని పోలీస్‌లు గురువారం తెలిపారు.

మృతులు ఓ షెల్టర్‌లో తలదాచుకుంటున్న నిర్వాసితులుగా జెక్ పబ్లిక్ టెలివిజన్ పేర్కొంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రమాదానికి కారణాలేమిటో దర్యాప్తు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారెవరూ కనిపించలేదని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News