- Advertisement -
గువాహటి: అస్సాంలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలకు వరదలు సంభవించడంతోపాటు పిడుగులు పడి ఇద్దరు మైనర్లతో సహా 8 మంది మరణించినట్లు అధికారిక ప్రకటన శనివారం వెలువడింది. గురువారం నుంచి అస్సాంలోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు నేలమట్టం కాగా, చెట్లు విరిగిపడడం, కరెంటు లైన్లు తెగిపడడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దిబ్రుగఢ్‌లో భారీ వరదలకు నలుగురు వ్యక్తులు మరణించారు. మృతులలో ఒక 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. బర్పేట జిల్లాలో గురువారం మరో ముగ్గురు వ్యక్తులు గురువారం వరదల్లో మరణించారని, గోల్‌పర జిల్లాలో పిడుగుపాటుకు ఒక 15 ఏళ్ల బాలుడు మరణించాడని సంస్థ తెలిపింది. గడచిన రెండు రోజుల్లో భారీ వర్షాలకు కనీసం 7,378 ఇళ్లు, ఇతర సంస్థలు దెబ్బతిన్నాయని సంస్థ తెలిపింది.
- Advertisement -