Thursday, January 23, 2025

వాయనాడ్‌లో లోయలో పడ్డ జీపు..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళలోని వాయనాడ్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మండుగురు కూలీలు మృతి చెందారు. వీరంతా తేయాకు తోటల్లో పనిచేసే మహిళలే అని వెల్లడైంది. పనులు ముగిసిన తరువాత వీరిని తీసుకుని వస్తున్న జీప్ మధ్యాహ్నం థవిన్‌హల్ గ్రామపంచాయతీ వద్ద ఓ లోయలో పడిపోయింది. దీనితో జీపు రెండు ముక్కలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. జీపులో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను గుర్తించారు. అయితే ఈ మహిళా కూలీలు ఎక్కడివారు అనేది నిర్థారించలేదు. కొండ మార్గంలో ఓ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడ్డట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News