- Advertisement -
హైదరాబాద్: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కర్ణాటకలోని తుముకురు జిల్లా పావగడ పలవలహళ్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సంఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరో 20మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైఎస్ హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఓవర్ లోడ్ కారణంగానే బస్సు బోల్తా కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
8 Killed in Bus Accident in Andhra-Karnataka Boarder
- Advertisement -