Tuesday, January 7, 2025

సిద్దార్థ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 killed in car-truck collision in Siddharthnagar

సిద్దార్థ్ నగర్: యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలో జాతీయ రహదారి 28పై ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. పదకొండు మందితో వెళ్తున్న జీపు రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గోరఖ్‌పూర్‌లోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తులో పడి ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు, మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News