Monday, December 23, 2024

తమిళనాడులో టపాసుల గోడౌన్‌లో పేలుడు: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఒక బాణసంచా గోడౌన్లో పేలుడు సంభవించి ముగ్గురు మహిళలతోసహా 8 మంది మరణించారు. పళయపేటైలోని బాణసంచా తయారీ డోడౌన్‌లో హఠాత్తుగా సంభవించిన పేలుడు కారణంగా 8 మంది మరణించగా పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

పేలుడు తీవ్రతకు గోడౌన్ సమీపంలోని ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని వారు చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదం స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News