Thursday, December 26, 2024

మిలటరీ ఎయిర్‌పోర్టులో పేలుడు..10మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబూల్: కొత్త సంవత్సరం ప్రారంభమై ఒకరోజు గడవక ముందే కాబూల్‌లో మృత్యుఘంటికలు మోగాయి. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని మిలటరీ ఎయిర్‌పోర్టు చెక్‌పాయింటు వద్ద ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోగా మరో 8మంది గాయపడ్డారని తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పేలుడుకు తామే ఏ హూగ్రసంస్థప్రకటించలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్‌గా గుర్తింపు పొందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ఐసిస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు. తాలిబన్లు 2021లో అధికారం చేపట్టిన తరువాత ఐసిస్ దాడులను ఉద్ధృతం చేసింది.

తాలిబన్ సైనికులును, మైనార్టీ షియా వర్గాన్ని లక్షంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడుతోంది. పేలుడు సంభవించిని ఎయిర్‌పోర్టు పౌర విమానాశ్రయానికి 200మీటర్ల దూరంలో ఉంది. గత అక్టోబర్‌లో ఆత్మాహుతి పేలుడు కారణంగా నలుగురు చనిపోవడంతో తాలిబన్ అంతర్గత మంత్రిత్వశాఖ మూసివేసింది. బాంబును స్థానిక ఉద్యోగి డెస్కులో ఉంచి పేల్చివేసినట్లు తాలిబన్ సెక్యూరిటీ కమాండర్ అబ్దుల్ ముబిన్ సఫీతెలిపినట్లు ఖామా ప్రెస్ నివేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News