Friday, January 24, 2025

రక్తం చిందిన రోడ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సూర్యాపేటప్రతినిధి/నంగునూరు (సిద్దిపేట): సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, రామసముద్రం (విజయరాఘవపురం) గ్రామానికి చెందిన 15 మం ది కూలీలు మిరప కోతల కోసం ఆటోలో మోతె నుండి హుస్సేనాబాద్ గ్రామానికి వెళ్తుండగా కేశవాపురంమోతె అండర్ పాస్ వద్ద మధిర నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్‌టిసి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు కందుల నాగమ్మ (63), చెవుల నారాయణమ్మ (56), పోకల అనసూర్య (62) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వీరిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరిలో రెమిడాల సౌభాగ్య (70), కందుల గురువయ్య (65) మరణించారు.

అదేవిధంగా సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, రాంపూర్ క్రాసింగ్ సమీపంలోని శ్రీనిధి రైస్ మిల్లు ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అతి వేగంగా వచ్చిన కారు, బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజగోపాల్ పేట పోలీసుల కథనం ప్రకారం… నంగునూరు మండలం, రాంపూర్ క్రాసింగ్ వద్ద కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో బైక్‌పై వెళున్న బద్దిపడగ గ్రామానికి చెందిన కట్టె రవి (55), నాగరాజ్ పల్లి గ్రామానికి చెందిన ముక్కెర ఐలయ్య (60)తో పాటు కారులో వెళ్తున్న దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల మమత (28) అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని 108 వాహనం ద్వారా సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News