Sunday, December 22, 2024

రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తం…

- Advertisement -
- Advertisement -

8 killed in road accidents in Telangana

హైదరాబాద్: తెలంగాణలోకి పలు జిల్లాల్లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్, భద్రాద్రి, మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వరంగల్ ఉరుసు గుట్ట వద్ద ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడింది. ప్రభుత్వ ఉద్యోగి సారయ్య(42), ఆయన భార్య సుజాత(39) మృతిచెందారు. బొల్లికుంటలో ఆటోను వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం దాస్ తండా వద్ద బైకు-లారీ ఢీకొని ఇద్దరు చనిపోయారు. మృతులను టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం వాసులు హనుమంత్, ఈసం స్వామిగా గుర్తించారు. మేడ్చల్ జిల్లా సూరారం వద్ద రెండు వాహనాలు ఢీకొని డ్రైవర్ మృతిచెందాడు. కోళ్ల లోడుతో వెళ్లున్న డిసిఎం- లారీ ఢీకొని డిసిఎం డ్రైవర్ మృత్యువాతపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News