Saturday, December 21, 2024

టిబెట్‌లో మంచు ఉప్పెనకు 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : టిబెట్ లోని నైరుతి ప్రాంతంలో అవలాంచ్ ( మంచు ఉప్పెన ) కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. టిబెట్ లోని నియింగ్‌చి నగరాన్ని మెడోగ్ కౌంటీని కలిపే సొరంగం బయట మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో హిమపాతానికి చిక్కుకున్న వారి కోసం గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 131 మంది సహాయ సిబ్బందితోపాటు 28 ఎమర్జెన్సీ వాహనాలు ఆ ప్రదేశానికి వెళ్లాయని చెప్పారు.

వీరికి సహాయంగా కేంద్ర ప్రభుత్వ అత్యవసర యాజమాన్య మంత్రిత్వశాఖకు చెందిన ఒక బృందం అక్కడికి వెళ్లిందని తెలిపారు. నియింగ్‌చి నగరం 9974 అడుగుల ఎత్తులో ఉంది. ప్రాంతీయ రాజధాని లాసా నుంచి వాహనంపై వెళ్లాలంటే ఐదు గంటలు పడుతుంది. ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కన్నా తక్కువగానే ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News