బీహార్: పూర్నియాలోని జలల్‌గఢ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో సోమవారం పైపులతో కూడిన ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కూలీలందరూ రాజస్థాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ట్రక్కు 16 మంది కూలీలను ఎక్కించుకుని అగర్తల (త్రిపుర) నుండి జమ్మూకి వెళుతున్నారు. మృతులంతా దినసరి కూలీలుగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సిలిగురి-ఢిల్లీ జాతీయ రహదారి 57లోని జలల్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ ఆలయం వద్ద తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. “పైపులతో కూడిన ట్రక్కు సిల్లిగురి నుండి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లే మార్గంలో ఉంది. కూలీలను కూడా లారీలో ఎక్కించారు. కాళీ దేవాలయం వద్దకు రాగానే లారీ బోల్తా పడింది. పైపులు వారిపై పడ్డాయి. వారిలో ఎనిమిది మంది పైపుల కింద ఇరుక్కుని చనిపోయారు. మేము వెంటనే ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాము. మృతదేహాలను వెలికితీశాము. అలాగే క్షతగాత్రులను రక్షించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాం. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది’’ అని ఉన్నతాధికారి సరోజ తెలిపారు.