Thursday, January 23, 2025

పడవ మునిగి ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

8 Members dead in Boat capsize in Jharkhand

భువనేశ్వర్: పడవ మునిగి ఏడుగురు మంది మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం కోడెర్మా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గిరిధ్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది  పంచ్ ఖరో జలాశయం చూడటానికి వెళ్లారు. షికారు చేద్దామని బోటులో జలాశయం లోపలికి వెళ్లారు. జలాశయంలో మధ్యలోకి వెళ్లిన తరువాతం బోటులోకి నీళ్లు రావడంతో మునిగిపోయింది. బోటుమన్ తో మరో వ్యక్తి ఈదుకుంటూ బయటకు వచ్చారు. మిగితా ఏడుగురు గల్లంతయ్యారు. బోటుమన్ సమాచారం మేరకు పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారు శివమ్ సింగ్(17), పాలక్ కుమారీ(14), శితారామ యాదవ్(40), సిజాల్ కుమారీ(16), హర్షల్ కుమార్ (08), భౌవా(05), రాహుల్ కుమార్ (16), అమిత్ కుమార్(14) అని వివరాలు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News