Friday, January 10, 2025

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

8 Members Of Family Killed In Rajasthan Road Accident

ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

బర్మార్: రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో ఒక ఎస్‌యువి, ట్రైలర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మైనర్లతోసహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. మరో వ్యక్త గాయపడ్డారు. గుడా మలాని పోలీసు స్టేషన్ పరిధిలోని మెగా హైవే సమీపంలో సోమవారం రాత్రి 11.55 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక పెళ్లిలో పాల్గొనేందకు వీరంతా ఎస్‌యువిలో జాలోర్ జిల్లాలోని సెడియా నుంచి గుడా మలానిలోని కంధీకి ధనికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వారు తమ గమ్యస్థానానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News