Monday, December 23, 2024

థియేటర్లు ఫుల్: శుక్రవారం 8 సినిమాలు రిలీజ్!

- Advertisement -
- Advertisement -

చిన్నసినిమాలకు టాలీవుడ్ లో రానురాను ఆదరణ పెరుగుతోంది. ఓటీటీల అండ ఉండటంతో చిన్న నిర్మాతలు ధైర్యంగా ముందుకొచ్చి సినిమాలు తీస్తున్నారు. వీటికి హిట్ శాతం కూడా ఎక్కువే ఉంటోంది. కొన్ని చిన్న సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా నిలుస్తున్నాయి కూడా. దీంతో ప్రతి శుక్రవారం థియేటర్ల వద్ద సందడి నెలకొంటోంది. తాజాగా ఈనెల 15న శుక్రవారం ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజవుతున్నాయి. వాటి వివరాలేమిటో చూద్దాం.

8 movies releasing in theatres this Fridayభూమి శెట్టి, చైతన్యరావు జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ 15న రిలీజవుతోంది. నిజాం సంస్థానంలో రజాకార్లు చేసిన దురాగతాలపై రూపొందించిన ఈ మూవీకి అడ్డంకులన్నీ తొలగిపోయి, 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘రజాకార్’ మూవీలో బాబీ సింహ, వేదిక తదితరులు నటించారు.

8 movies releasing in theatres this Fridayబిగ్ బాస్ ఫేమ్ దివి నటించిన ‘లంబసింగి’ విడుదల కూడా 15నే. అందాల సుందరి ఎస్తేర్ నోరాన్హా ప్రధాన పాత్ర పోషించిన ‘మాయ’తోపాటు అనన్య నాగళ్ల నటించిన ‘తంత్ర’ కూడా ఇదే రోజున విడుదల అవుతున్నాయి. వీటితోపాటు ‘స్వామి నాగులకొండ’, ‘రవికుల రఘురామ’, ‘లైన్ మేన్’ మూవీలు కూడా 15న రిలీజ్ కు సిద్ధమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News