Sunday, December 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌ఘఢ్ సుక్మా జిల్లాలో మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి ఎనిమిది మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. చింతల్‌నార్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి ఆరుగురు కేడర్‌లను. కోంటా, చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధులలో నుంచి ఒక్కొక్క నక్సల్‌ను పట్టుకున్నట్లు పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. రాష్ట్ర పోలీస్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సిఆర్‌పిఎణ్165వ, 150వ బెటాలియన్లు, కోబ్రా 201వ బెటాలియన్ సమష్టి బృందాలు ఆ అరెస్టుల్లో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన కేడర్లు అందరూ 20, 55 ఏళ్ల మధ్య ఉన్న పురుషులేనని ఆయన చెప్పారు. చింతల్‌నార్ నుంచి అరెస్టు చేసిన కేడర్‌ల దగ్గర నుంచి డిటొనేటర్ వైర్లు, బాణసంచా, డిటొనేటర్లు, కార్డెక్స్ వైర్ (పేలుడు పదార్థాల్లో ఉపయోగించేది), మావోయిస్ట్ బ్యానర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News