Thursday, January 23, 2025

నేడు నర్సంపేటకు 8 మంది కొత్త ఎడిసిలు రాక

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: ఏడీసీలుగా పదోన్నతి పొంది వరంగల్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 8 మంది అడిషనల్ డిపో క్లర్కులు నేడు ఆర్టీసీ నర్సంపేట డిపోకు రానున్నారు. వరంగల్ రీజియన్‌లో ఉన్న తొమ్మిది డిపోల నుంచి పెద్ద ఎత్తున సీనియర్ డ్రైవర్, కండక్టర్లకు పదోన్నతి కల్పిస్తూ ఇటీవల వరంగల్ రీజినల్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వరంగల్. 1 డిపో నుంచి బండి రమేశ్, హన్మకొండ డిపో నుంచి సుధాకర్, తొర్రూరు డిపో నుంచి రమేశ్, వెంకటయ్య, స్వామి, సాయిబ్రహ్మం, నర్సంపేట డిపోలో పనిచేస్తున్న బత్తిని సాంబయ్య, వనపర్తి శ్రీనివాస్ పదోన్నతిపై నర్సంపేట డిపోకు రానున్నారు. ఈ సందర్భంగా వారు రీజనల్ మేనేజర్ శ్రీలత, జడ్‌ఎస్‌టీసీ ప్రిన్సిపాల్ మోహన్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. 1991 బ్యాచ్‌కు చెందిన వరంగల్ గిర్మాజీపేటకు చెందిన నర్సంపేట డిపో డ్రైవర్ కోట రాజు, వరంగల్ గొర్రెకుంటకు చెందిన కండక్టర్ మాచెర్ల వెంకటస్వామి అలియాస్ ఎంవీ స్వామి పదోన్నతిపై భూపాలపల్లి డిపోకు ఏడీసీగా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News