Friday, December 20, 2024

గడిసెలోకి దూసుకెళ్లిన ఇసుక ట్రక్కు.. ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

హర్దోయ్: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం..
మంగళవారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. గంగానది తీరం నుంచి హర్దోయికి ఇసుక ట్రక్కు వెళ్తుండగా మల్లవాన్‌ పట్టణ ప్రాంతంలో అదుపుతప్పి.. రోడ్డు పక్కనున్న గుడిసెలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

గుడిసెలో నిద్రిస్తున్న కుటుంబంపై ఇసుకు పడటంతో 8 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో ట్రక్కును తొలగించి.. ఇసుక కింద నుంచి మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఓ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News