Saturday, November 23, 2024

ఘోర విషాదం.. హోమియో వైద్యం వికటించి 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం.. హోమియో వైద్యం వికటించి 8మంది మృతి
మృతులంతా ఒకే కుటుంబీకులు, వైద్యుడు పరారీ

8 Family Members Died Bilaspur In Chhattisgarh

రాయ్‌పూర్:చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సిర్గిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో జరిగింది. హోమియోపతి మందులను వాడిన తర్వాత వీరంతా చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరు ద్రోసేరా30 అనే మందు వాడినట్టు తెలిసింది. బాధితుల్లోనలుగురు మంగళ వారం అర్థరాత్రి మరణించారు. మరో ముగ్గురు బుధవారం మరణించారు. అయితే వీరికి కరోనా సొకిందనే అనుమానంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు. వీరి మరణాలతో అప్రమత్తమైన పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లి సంఘటనపై ఆరాతీస్తున్నారు. మరికొందరిని బిలాస్‌పూర్‌లోని ‘సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరందరు హోమియోపతి ప్రాక్టిస్‌చేసే వ్యక్తి నుంచి ఈ సిరప్ తీసుకున్నట్లు దర్యాప్తులో తెలింది. ద్రోసేరా అనే ఈ ఔషధాన్ని గొంతు నొప్పి, దగ్గు, కీళ్ల నొప్పులకు వాడతారు. అయితే సంఘటన తర్వాత వైద్యుడు గ్రామం నుంచి పారిపోయాడు. కేసును నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

8 of family members died in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News