Saturday, November 16, 2024

ఆసియా లోని అత్యంత కాలుష్య 10 నగరాల్లో 8 భారత్ లోనే

- Advertisement -
- Advertisement -

8 of the 10 most polluted cities in Asia are in India

వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడి
అగ్రస్థానంలో ఎన్‌సిఆర్, గురుగ్రామ్

న్యూఢిల్లీ : ఆసియా లోని అత్యంత కాలుష్య నగరాలు 10 ఉండగా, వాటిలో 8 భారత్ లోనే ఉన్నాయని ప్రపంచ వాయు నాణ్యత సూచిక (వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) వెల్లడించింది. ఈ సూచిక ప్రకారం 0 నుంచి 50 వరకు గల సూచికలో ఉత్తమ నగరాలను పరిగణిస్తారు. 51నుంచి 100 వరకు ఒక మోస్తరుగా, 101 నుంచి 150 అనారోగ్యకరమైన ఉద్రిక్త ప్రాంతాలున్న నగరాలుగా, , 151 నుంచి 200 వరకు అన్ని గ్రూపుల్లోనూ అనారోగ్యకరమైనవిగా , 201 నుంచి 300 వరకు చాలా అనారోగ్యకరమైన వాటిగా పరిగణిస్తారు. 301 నుంచి 500 వరకు మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైన నగరాలుగా గుర్తిస్తారు. భారత్ లోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) ఉంది. ఈ పది నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే ఉత్తమ వాయునాణ్యత కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. ఈ సూచికలో 679 ర్యాంకులో గురుగ్రామ్ అత్యంత కాలుష్య నగరంగా చేరింది. తరువాతి స్థానాల్లో రెవారి సమీపాన గల ధారుహెరా పట్టణం ( 543), బీహార్ లోని ముజఫర్‌పూర్ (316) ్ల ఉన్నాయి.

ఈ జాబితా నుంచి ఈసారి ఢిల్లీ తప్పించుకోగలగడం విశేషం. మిగతా నగరాలను పరిశీలిస్తే టాల్కటర్ , లక్నో (298).డిఆర్‌సిసి ఆనంద్‌పూర్ , బెగుసరాయి (269).భోపాల్ చౌరహా , దేవాస్ (266).ఖడక్‌పడ , కల్యాన్ (256), దర్శన్‌నగర్, చాప్రా (239) ఉన్నాయి. భారత్ లోని నగరాలే కాకుండా, చైనా లోని లుఝోలో జియావోషిషాంగ్ రేవు పట్టణం (262) అధ్వాన్నమైన వాయునాణ్యత గల పట్టణాల జాబితాలో చేరింది. మంగోలియా యులాన్‌బాటాలోని బయాంఖోషూ ఇదే జాబితాలో ఉంది. ప్రజల్లో వాయు నాణ్యతపై అవగాహన, ప్రపంచ స్థాయి వాయునాణ్యత సమాచారం తెలియజేయడానికి 2007లో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రాజెక్టు ప్రారంభమైంది.

దీపావళి …అధ్వాన్నమైన వాయు నాణ్యతకు నాంది

దీపావళి పండగ అనే మాటే కానీ వాయు నాణ్యత ఎంత అధ్వాన్నమౌతుందో చెప్పవచ్చు. బాణాసంచాలు కాల్చడంతో భారత్‌లోని అనేక నగరాల్లో ఢిల్లీ ఎన్‌సిఆర్‌తో సహా వాయునాణ్యత దెబ్బతిని కాలుష్యం పెరుగుతుంది. పంట వ్యర్థాలను మండించడం కూడా కాలుష్య స్థాయిలు పెరగడానికి దోహదపడుతుంది. దీపావళి తరువాత ఢిల్లీ ఎన్‌సిఆర్ వాయు నాణ్యత ప్రస్తుత స్థాయి కన్నా మరింత దిగజారుతుందని ఎక్యుఐ అంచనా వేసింది. కమిషన్ ఆఫ్ ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సిఎకుఎం) సబ్ కమిటీ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 12 నిబంధనలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రెండో దశ ప్రమాణాలను అమలు లోకి తెచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వాయు కాలుష్య నియంత్రణ కోసం 15 నిబంధనల శీతాకాల కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. ఏటా ఈ సమయంలో పంట వ్యర్థాలను మండించడమే వాయు కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరుగుతుంటాయని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News