- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మొత్తం ఎనిమిది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. హన్మకొండలోని ఓ మహిళకు ఒమిక్రాన్ వైరస్ సోకిందని తెలంగాణ వైద్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ అనేది కరోనా వైరస్‌లో భాగమేనన్నారు. ఒమిక్రాన్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ బాధితుల్లో వ్యాధి లక్షణాలు లేవని, ఒమిక్రాన్‌తో యుకెలో ఒకరు తప్ప ఎవరూ చనిపోలేదన్నారు. కాని ఒమిక్రాన్ పట్ల నిర్లక్షంగా ఉండకూడదని హెచ్చరించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ వచ్చే అవకాశం ఉందని, వ్యాక్సిన్ తీసుకోని వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
- Advertisement -