Saturday, December 21, 2024

నేపాల్‌లో హిమపాతానికి కనీసం ఎనిమిది మంది మృతి!

- Advertisement -
- Advertisement -
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

ఖాట్మాండు: పశ్చిమ నేపాల్‌లోని దార్చులా జిల్లాలో హిమపాతం కారణంగా కనీసం ఎనిమిది మంది సమాధి అయ్యుంటారని అనుమానిస్తున్నారు. స్థానిక ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పాటు సాయుధ పోలీసు బలగాల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

బాధిత వ్యక్తులను ఇంకా గుర్తించలేదు. కాగా ఎనిమిది మంది యార్సగుంబా సేకరణకారులు తప్పిపోయినట్లు భావిస్తున్నారు. స్థానిక మీడియా కథనం ప్రకారం గొంగలిపురుగు ఫంగస్ కోసం వెతకడానికి వెళ్లిన 8 నుంచి 9 మంది వ్యక్తులు గుడారంలో ఉండగా హిమపాతం సంభవించింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో వ్యాస్ రూరల్ మున్సిపాలిటీ1లోని బోలిన్‌లో చోటుచేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News