Wednesday, December 18, 2024

బీహార్‌లో కల్తీమద్యం తాగి ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లోని శివాన్, శరణ్ జిల్లాలలో కల్తీ సారా తాగి ఆరుగురు మరణించగా మరో 14 మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. శివాన్‌లో నలుగురు, శరణ్‌లో ఇద్దరు మరణించినట్లు తెలిసిందని బుధవారం అధికారులు తెలిపారు. మఘర్, ఔరియా పంచాయతీలలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితులలో మరణించినట్లు బుధవారం ఉదయం 7.30 గంటలకు సమాచారం అందిందని శివాన్ జిల్లా మెజిస్ట్రేట్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు. వెంటనే గ్రామానికి అధికారులను పంపగా తీవ్ర అస్వస్థతకు గురైన మరో 12 మందికిపైగా గ్రామస్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని ఆయన చెప్పారు. వీరిలో ఒకరు మరణించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి కల్తీ మద్యం తాగిన తర్వాత అస్వస్థతకు గురైన వారిలో నలుగురు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News