Thursday, January 23, 2025

పొగ వల్లే.. ప్రాణాలు పోయాయి

- Advertisement -
- Advertisement -

8 people died due to smoke inhalation

‘సికిందరాబాద్’ ఘటన నివేదికలో క్లూటీం వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన క్లూస్ టీం ఈ ఘటనలో పొగ ఎక్కువగా పీల్చుకోవడం వల్లే 8 మంది చనిపోయినట్లు ప్రాధమిక నివేదికలో పేర్కొన్నారు. ఈక్రమంలో సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనలో క్లూస్ టీం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ భవనంలోని సెల్లార్‌లో విద్యుత్ ద్విచక్ర వాహనానికి ఛార్జింగ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జింగ్ ఫుల్ అయ్యాక పొగ వెలువడి ఆపై వాహనాలకు మంటలంటుకొని క్రమంగా మిగతావాటికి వ్యాపించాయని తేల్చారు.

బ్యాటరీలోని లిథియం అయాన్ రసాయనం కారణంగా భారీగా పొగలు వచ్చాయని పేర్కొన్నారు. సెల్లార్‌లోని మెట్ల నుంచి లాడ్జిలోని నాలుగో అంతస్తు వరకు పొగ కమ్ముకున్నట్లు వివరించారు. ఆ పొగను పీల్చుకోవటంతోనే 8 మంది చనిపోయారని, ఈ ఘటనలో మరికొందరు అపస్మారకస్థితిలో పడిపోయినట్లు గుర్తించారు. కాగా ఈ ప్రమాద సమయంలో మంటలు మాత్రం సెల్లార్ వరకే పరిమితమైనట్లు స్పష్టం చేశారు. సెల్లార్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి వాహనాలన్నీ కాలిపోయాయని, వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించిందని తెలిపారు. క్షణాల వ్యవధిలో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేయడంతో 8 మంది మృతి చెందారని, మరో 9మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News