Wednesday, October 16, 2024

ఒకే గ్రామంలో 8 మందికి ఉపాధ్యాయ కొలువులు

- Advertisement -
- Advertisement -

ఒకే గ్రామానికి చెందిన 8 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించడం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ నియామకాల్లో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన 8 మంది మేర్గు హరి(136), కోన్‌రెడ్డి సమత (8), బొమ్మెర సతీష్ (303), సంగెం సతీష్ (303), పల్లకొండ శిల్ప (212), కుక్కల శృతి (22), పులిచేరు మహేష్ (240), సంగెం కార్తీక్ (83), బోదె దివ్య (34)వ ర్యాంకులు సాధించిన ఈ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించడం ఆనందంగా ఉందని,

ఉద్యోగం వచ్చిన ఉద్యోగుల కుటుంబాల స్థితిగతులను గ్రామంలోని పలువురు కొనియాడారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయదారుల సంఘం సమూహ ప్రతినిధి పులి దేవేందర్ ముదిరాజ్‌తోపాటు పలువురు అభినందించి శుభాకాంక్షలు తలెఇపారు. గ్రామాభివృద్ధికి వీరి సహకారాలు ఎల్లవేళలా ఉండాలని వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి కన్న తల్లిదండ్రులను పేరు తేవాలని గ్రామపెద్దలు బొబ్బాల మహేందర్, కోన్‌రెడ్డి మల్లారెడ్డి, మాటూరి కొమురయ్య, రవికిరణ్, మాడుగుల కుమార్, ఎండీ షరీఫ్, రాజు, బాబు, బిక్షపతిలతోపాటు గ్రామస్థులు, గ్రూపు సభ్యులు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News