Friday, December 20, 2024

ఎస్‌ఓటి పోలీసుల అదుపులో 8 మంది పేకాట రాయుళ్లు

- Advertisement -
- Advertisement -

కీసర: రాంపల్లిలోని పేకాట స్థావరంపై దాడులు నిర్వహించిన ఎస్‌ఓటీ పోలీసులు 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి ఆర్‌ఎల్ నగర్ మధుర నగర్‌లోని ఓ ఇంటిలో సోమవారం పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

అక్కడ పేకాట ఆడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు బద్దం మహేందర్, చెరుకుపల్లి అశోక్‌రెడ్డి, మూర్తి శ్రీనివాస్, ఏర్లదిండ్ల మహేష్, పురమని శివారెడ్డి, కోడూరి కరుణాకర్, పల్లపు మహేష్, పెద్దుల శ్రీనివాస్‌లు పట్టు బడ్డారు. వీరి నుండి 8 మొబైల్ ఫోన్లు, రూ.16,000 నగదు స్వాధీనం చేసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు కీసర పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పేకాట అడుతున్న 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News