Sunday, December 22, 2024

బిజెపికి 8 సీట్లు… కవితకు బెయిల్: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ రావడంతో చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టడంలేదని, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదని, కవితకు ఎలా వచ్చిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కోసం బిఆర్‌ఎస్ పని చేసిందని, ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో బిజెపి గెలిచేందుకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు పని చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందని చర్చ జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News