పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసిన ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తోంది. మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయిన్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది.
కొత్తగా విడుదలైన టీజర్ విడిపోవడం వల్ల కలిగే బాధలతో వున్న కన్న పసునూరిని అవంతిక ఓదార్చడంతో ప్రారంభమవుతుంది. అతని దుఃఖం లోతును ఆమె అర్థం చేసుకోలేదని చెప్పడంతో పాటు హను రెడ్డితో తన ఫస్ట్ లవ్‌ని తెలియజేస్తుంది. టీజర్‌లో అనంతిక సనిల్‌కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది. టీజర్ కన్న పసునూరి, హను రెడ్డి యొక్క కీలక పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. ఈ టీజర్ విభిన్నమైన భావోద్వేగాలను అద్భుతంగా చూపించింది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది.