Monday, December 23, 2024

కాలిఫోర్నియాలో 8 నెలల చిన్నారి, ఆమె తల్లిదండ్రులు, మామ కిడ్నాప్‌

- Advertisement -
- Advertisement -

8 year child and his parents uncle kidnapped

కాలిఫోర్నియా: మెర్సిడ్ నగరంలో సోమవారం 8 నెలల చిన్నారితో సహా భారతీయ సంతతి కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు. అపహరణకు గురైన వారిని జస్దీప్ సింగ్ (36), అతని భార్య జస్లే, వారి 8 నెలల కుమార్తె అరూహి ధేరి , ఆ పిల్ల మామ అమన్‌దీప్ సింగ్ (39)గా గుర్తించారు. స్థానిక మీడియా ఏబిసి 10 ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. “సౌత్ హైవే 59 యొక్క 800 బ్లాక్  నుండి వారి ఇష్టానికి విరుద్ధంగా కిడ్నాపర్  కుటుంబాన్ని తీసుకువెళ్లాడు” అని పోలీసులు తెలిపారు. ‘‘ వారిని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలియదు. అయితే వారు తమ ప్రదేశంలో లేరన్నది స్పష్టం’’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెర్న్ వార్న్కే తెలిపారు. దర్యాప్తు ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కిడ్నాపర్ చిత్రాన్ని కూడా పోలీసులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అనుమానితుడిని గుర్తిస్తే ప్రజలు అతడి వద్దకు వెళ్లవద్దని, 911 నంబర్ కు కాల్ చేయాలని కూడా పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News