Sunday, December 22, 2024

దైవ దర్శనానికి వెళ్తూ..అనంత లోకాలకు

- Advertisement -
- Advertisement -

వైరా: దేవుని దర్శనానికి వెళ్తూ బైక్‌ పై నుండి ప్రమాదవశత్తూ  జారీ పడి బాలిక మృతి చెందిన సంఘటన వైరా మండల పరిధిలోని కేజి సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. వైరా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఏన్కూర్ మండలం తూతక లింగన్నపేట గ్రామానికి చెందిన రాజబోయిన సురేష్ తన భార్య, కుమారుడు,కూతురిని బైక్ పై ఏన్కూర్ నుండి ఎపిలోని ఎన్‌టిఆర్ జిల్లాలోని నెమలి వెణుగొపాల స్వామి దర్శనానికి వెళ్తున్నారు.

మార్గ మధ్యలో కేజి సిరిపురం వద్ద ప్రమాదవశత్తూ బైక్ అదుపు తప్పి రొడ్డు పై పడటంతో సురేష్ కూతురు వేద ప్రియ(8) తలకు తీవ్ర గాయం అయింది. దీంతో వేద ప్రియను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతి చెందటంతో తూతక లింగన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News