Wednesday, January 22, 2025

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరులో వ్యభిచారం గుట్టురట్టైంది. సర్పంచ్ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పొలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది యువకులు, ఒక యువతి పట్టుబడ్డారు. ఇంట్లో మద్యం, మందుబాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి.

మహేశ్వరం మండలం పరిధిలోని శుభన్ పూర్ గ్రామానికి చెందిన బొల్లు శ్రీకాంత్, పెద్దమ్మతండ గ్రామానికి చెందిన పాట్లవత్ రాజు, చిన్న తుప్పర గ్రామానికి చెందిన నాగరాజు, మనసంపల్లి గ్రామానికి చెందిన పెండ్లిమడుగు నవీన్, నల్లచెరువు తండాకు చెందిన ధనుల రవి కలిసి వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ యువతినీ ఆన్లైన్ సంప్రదించారు. ఆ యువతిని హైదరాబాద్ లో కారులో పికప్ చేసుకుని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ సర్పంచ్ ఇంట్లో ఉంచారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది యువకులు, ఒక యువతితో పాటు 3 కార్లు, 16 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూరు సిఐ బాలరాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News