Wednesday, January 22, 2025

గ్రూప్-4కు 80% హాజరు

- Advertisement -
- Advertisement -
ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి నిరాకరణ
సెల్‌ఫోన్‌తో పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థిపై కేసు
బలగం సినిమాపై ప్రశ్న

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొ త్తం 8,180 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 9,51, 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టిఎస్‌పిఎస్ సి వెల్లడిచింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగగా, సుమారు 80 శాతం హాజరు న మోదైనట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పేపర్1కు 7,62,872 మంది హాజరుకాగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షకు 7,61,198 మంది హాజరైనట్లు కమిషన్ పేర్కొంది.

నగరంలోని మారుతీనగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలోకి ఒక అభ్యర్థి సెల్‌ఫోన్‌తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే ఫోన్‌ను జప్తు చేసుకొని మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. సదరు అభ్యర్థిని డీబార్ చేసి.. సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు నిర్ధిష్ట సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. ఆలస్యం కారణంగా కొందరిని.. సరైన పత్రాలు లేకపోవడంతో మరికొందరిని అధికారులు వెనక్కి పంపించేశారు. నల్గొండ జిల్లా చండూరులో మరియానికేతన్ పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు లేకుండా జిరాక్స్ తెచ్చారని ఐదుగురిని సిబ్బంది బయటకు పంపించారు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులనూ తిప్పి పంపారు.

గ్రూప్ -4లో బలగం సినిమాపై ప్రశ్న
తెలంగాణ నేపథ్యంలో ఓ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం సినిమా గురించి గ్రూప్ -4లో ఒక ప్రశ్న అడిగారు. బలగం చిత్రానికి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని జత పరచడండి అని ప్రశ్న అడిగారు. కాగా, బలగం సినిమాపై గ్రూప్- 4లో ప్రశ్న అడగడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. డైరెక్టర్ యెల్దండి వేణు దీనిపై హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News