- Advertisement -
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు నగర మూడవ మెట్రోపాలిటన్ జడ్జి జ్యోతిర్మయి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. నగరంలోని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు పలువురిని పట్టుకున్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం, వితఔట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓవర్ స్పీడ్, వితఔట్ నంబర్ ప్లేట్ తదితర నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకున్నారు. ఇలా పట్టుకున్న 80మంది కోర్టు జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రెండు రోజుల జైలు శిక్ష, జరిమానా, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడుపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -