Monday, December 23, 2024

రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడిపై ప్రేమను చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బక్కవ్వకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లిలో తమ్ముడు మల్లేశం దగ్గరికి వెళ్లి రాఖీ కట్టాలనుకున్నారు. అక్కడికి రవాణా సౌకర్యం లేకపోవడంతో 8 కి.మీ. మేర నడిచి వెళ్లారు. దారిలో ఎక్కడికి వెళ్తున్నావని ఓ యువకుడు ప్రశ్నించగా రాఖీ కట్టేందుకు అని బదులిచ్చారు. తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 8 కిలోమీటర్లు నడిచి పుట్టింటికి చేరుకొని తమ్ముడు గౌడ మల్లేశంకు రాఖీ కట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News